జాక్‌పాట్ కొట్టిన ‘హనుమాన్’.!

- January 16, 2024 , by Maagulf
జాక్‌పాట్ కొట్టిన ‘హనుమాన్’.!

‘హనుమాన్’.. బాల నటుడిగా పేరు తెచ్చుకుని హీరోగా మారిన తేజ సజ్జా లీడ్ రోల్ పోషించిన సినిమా. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకుడు.
ఈ సినిమా మొదట్నుంచీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. అయితే, సంక్రాంతి బరిలో సినిమా నిలవడమే చాలా మందికి డైజెస్ట్ కాలేదు. కానీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ‘హనుమాన్’ టీమ్ గట్టిగా నిలబడింది.
ఫైనల్లీ రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్ల నుంచే మంచి వసూళ్లు రాబట్టేసింది. రిలీజ్ అయ్యాకా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ‘హనుమాన్’ సినిమా.
దాంతో, అందరూ హ్యాపీ.. చాలా చాలా హ్యాపీ. నిర్మాతలకు ఈ సినిమా కాసుల పంట పండిస్తోంది. పిల్లా పెద్దా.. ముసలీ ముతకా.. అనే తేడా లేకుండా.. పండగ సీజన్‌లో ఈ సినిమాని బాగా వీక్షిస్తున్నారు.
మొత్తానికి తేజ సజ్జా మంచి విజయం ‘హనుమాన్’తో తన ఖాతాలో వేసుకున్నాడు. కష్టపడ్డందుకు మంచి పలితం దక్కింది ‘హనుమాన్’ టీమ్‌కి. పండగ సీజన్ దాటాకా కూడా ‘హనుమాన్’ వసూళ్లు ఆగేలా కనిపించడం లేదు. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com