‘గుంటూరు కారం’.! మహేష్ టైమ్ బాగుందిలే.!
- January 16, 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ కాంబినేషన్‌లో గతంలో రెండు సూపర్ హిట్ సినిమాలు రావడంతో, హ్యాట్రిక్ ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయ్ మొదట్నుంచీ.
అయితే, సినిమాపై ఏమంత పాజిటివ్ బజ్ క్రియేట్ కాలేదు. రిలీజ్ దగ్గర పడినా సరే, సినిమా నిలవడం కష్టమే అనుకున్నారంతా. ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. పండగ రెండు రోజుల ముందే.
ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ, ఎందుకో తెలీదు. ఆ తర్వాత జనం బాగా ఎట్రాక్ట్ అయ్యారు. టాక్‌తో సంబంధం లేకుండా ‘గుంటూరు కారం’ ధియేటర్లు కళకళలాడడం మొదలయ్యాయ్.
మొదట నిర్మాతలకి లాస్ అనే టాక్ వచ్చింది. కానీ, లాస్ నుంచి తేరుకుని ఈ మూడు రోజుల్లోనే సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. దాంతో, అందరూ హ్యాపీ ఫీలవుతున్నారు.
మహేష్ బాబు మాస్ అప్పీల్.. శ్రీలీల డాన్సులు, మీనాక్షి చౌదరి అందాలు.. ఏవైతేనేం.. ఓవరాల్‌గా సంక్రాంతి సీజన్‌లో ‘గుంటూరు కారం’ నిలబడిపోయిందంతే. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, మళ్లీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. చూడాలి మరి, ఈ రెండు రోజుల్లో పరిస్థితులు ఎలా వుండబోతున్నాయో.!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!