అసలు సిసలు సంక్రాంతి.! సినీ ప్రియుల పండగే.!
- January 16, 2024
సంక్రాంతి సినీ ప్రియులకి ఎప్పుడూ పండగే. అయితే, కొన్నిసార్లు సంక్రాంతి సీజన్ చాలా డిజప్పాయింట్ చేస్తుంటుంది. కానీ, ఈ సారి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఇటు బాక్సాఫీస్‌కీ, అటు సినీ ప్రియుల్ని విశేషంగా అలరిస్తోంది.
ఈ ఏడాది నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయ్. నాలుగూ ప్రేక్షకాదరణ పొందుతున్నాయ్. ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్‌కి కాసుల పంట అయితే పండిస్తున్నాయ్.
‘హనుమాన్’ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని అందుకుంది. ‘గుంటూరు కారం’ కూడా అంతే. ఇక మరో రెండు సినిమాలూ ‘సైంధవ్’ డిఫరెంట్ మూవీ.
‘నా సామిరంగ’ అసలు సిసలు సంక్రాంతి సినిమా. కొట్టుకెళ్లిపోతోంది. ఓవరాల్‌గా ఈ ఏడాది సంక్రాంతిని సినీ సంక్రాంతిగా అభివర్ణిస్తున్నారు.
రిలీజ్‌కి ముందు ఎలాంటి వాడీ వేడీ చర్చలు జరిగినా.. వన్స్ సినిమాలు ధియేటర్లలో సందడి చేయడం స్టార్ట్ చేశాకా.. ప్రేక్షకాదరణ పొందడంలో ఇలాంటి కళే కనిపిస్తే.. ఇండస్ట్రీ పది కాలాలు పచ్చగా వుంటుందనడం అతిశయోక్తి కాదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







