సౌదీ అరేబియాలో 5 రోజులపాటు ఈద్ సెలవులు!

- January 17, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో 5 రోజులపాటు ఈద్ సెలవులు!

రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఈద్ సెలవులపై చర్చించింది.  స్వంత కార్మిక వ్యవస్థలు, నిబంధనల ప్రకారం పనిచేసే ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఈద్ అల్-ఫితర్ మరియు ఈద్ అల్-అధా రెండింటికి అధికారిక సెలవులు కనీసం నాలుగు నుంచి  ఐదు పని దినాల వరకు పొడిగించే అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన సవరణను కేబినెట్ ఆమోదించిందని మీడియా మంత్రి సల్మాన్ బిన్ యూసఫ్ అల్-దోసరీ తెలిపారు. అలాగే ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాల ఫలితాలను కేబినెట్ సమీక్షించిందని పేర్కొన్నారు. "హజ్ మరియు ఉమ్రా సర్వీసెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్" నిర్వహణలో కృషి చేసినందుకు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖను క్యాబినెట్ అభినందించిందని తెలిపారు. 133 దేశాలను ఏకతాటిపైకి తెచ్చిన 3వ ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ ఫలితాన్ని క్యాబినెట్ ప్రశంసించింది. అవినీతిని నిరోధించడానికి సౌదీ పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ మరియు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్‌లోని అవినీతి నిరోధక కమిషన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com