‘ది రాజా సాబ్’ .! వద్దు మహా ప్రభో.!

- January 17, 2024 , by Maagulf
‘ది రాజా సాబ్’ .! వద్దు మహా ప్రభో.!

ప్రబాస్ హీరోగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో ప్రబాస్ చేయబోయే సినిమాకి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు.

బాగానే వుంది కానీ, ఈ టైటిల్ అస్సలు బాగా లేదంటూ, ప్రబాస్ ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. టైటిల్ మార్చాలని సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్స్ చేస్తున్నారు.

అసలు మారుతి డైరెక్షన్‌లో సినిమానే వద్దని గగ్గోలు పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ వీక్ టైటిల్.. వద్దు బాబోయ్ వద్దంటున్నారు. అసలే ప్రబాస్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు.

‘సలార్’ ఏదో జస్ట్ అలా కలిసొచ్చిందంతే. అది ప్రబాస్ రేంజ్ కానే కాదు. ఈ టైమ్‌లో మారుతితో సినిమా.. అదీ ఈ వీక్ టైటిల్‌తో అంటే అస్సలే వద్దంటున్నారు. చూడాలి మరి, ఈ లొల్లి మరీ ఎక్కువయితే, తప్పదు ప్రబాస్ టైటిల్ మార్చుకోవల్సిందే. అన్నట్లు ఇదో హారర్ కామెడీ కాన్సెప్ట్ మూవీ అని గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com