విజయ్ దేవరకొండకే ఎందుకిలా.?
- January 17, 2024
మైత్రీ మూవీస్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాల్సి వుంది. అదే ‘హీరో’ సినిమా. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాకా అటకెక్కేసింది. ఎందుకో తెలీదు కానీ, మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
అలాగే, పూరీ డైరెక్షన్‌లో ‘జనగణమన’ సినిమా ఒకటి విజయ్ దేవరకొండ చేయాల్సి వుంది. అది కూడా ఆగిపోయింది. ఇదే కాంబోలో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
తాజాగా మళ్లీ ఇలాంటి న్యూసే ఇంకోటి సర్క్యులేట్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా కూడా ఆగిపోయిందనేదే ఈ ప్రచారం తాలూకు సారాంశం.
‘లైగర్’ డిజాస్టర్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని బాగా దెబ్బ తిసేసింది. చాలా మంది హీరోలకి చాలా డిజాస్టర్లు కెరీర్‌లో ఎదురవుతుంటాయ్. కానీ, విజయ్ దేవరకొండకే ఎందుకిలా జరుగుతోంది. మొన్న వచ్చిన ‘ఖుషి’ ఏదో అలా మమ అనిపించాడంతే. జస్ట్ యావరేజ్ హిట్ లిస్టులోకే వెళ్లింది ఈ సినిమా కూడా. మరి తాజా ప్రచారంలో నిజమెంతో.!
మరోవైపు ఈ ప్రచారంలో నిజం లేదనీ, ఇదంతా ఫేక్ న్యూస్ అనీ అంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో.! ..
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!