మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్.!
- January 18, 2024
మెగాస్టార్ చిరంజీవికి ఆ ట్యాగ్ కన్నా మించిన బిరుదు, ఉన్నతమైన గౌరవం ఇంకేముంటుంది.? అనేది చాలా మంది ఆయనను హార్ట్ఫుల్గా అభిమానించే వారి వుద్దేశ్యం.
అయితే, ఆయన కేవలం ఓ సినిమా హీరో మాత్రమే కాదు. సామాజిక సేవల్లోనూ ఆయన ఉత్తముడే. అందుకే ఉత్తమ సామాజిక సేవల నిమిత్తం ఇచ్చే గౌరవ పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ పురస్కారంతో చిరంజీవిని సత్కరించాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.
గతంలోనే ఈ పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాల్సి వుంది. అయితే, పద్మ భూషణ్ ఇచ్చి సరిపెట్టేశారు. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ తెరపైకి వచ్చింది. చిరంజీవికి ఈ సారి పద్మ విభూషణ్ తప్పక ఇవ్వనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారాయన. అలాగే కోవిడ్ టైమ్లో బ్లడ్ బ్యాంక్ సేవలతో పాటూ, ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు అందించి సంచలనం సృష్టించారు. ఎంతో మంది కోవిడ్ బాధితుల పాలిట ప్రాణ దాతగా నిలిచారు చిరంజీవి. ఈ కోణంలోనే ఆయనకు పద్మ విభూషణ ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







