‘భైరవకోన’లో సందీప్ కిషన్.! ఈ సారి గట్టిగా కొట్టేలానే వున్నాడు.!
- January 18, 2024
సందీప్ కిషన్ మంచి నటుడు. ఎప్పటి నుంచో హీరోగా కొనసాగుతున్నాడు. కానీ, సరైన హిట్టు లేక రేస్‌లోకి రాలేకపోతున్నాడు. అయితే, ఈ సారి సందీప్ కిషన్ కొట్టేలానే వున్నాడు. గట్టిగా కొట్టేలానే వున్నాడు.
‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది.
థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ తరహా కాన్సెప్టులతో వచ్చిన సినిమాలకి ఈ మధ్య ప్రేక్షకాదరణ బాగానే దక్కుతోంది. సో, ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు.
ట్రైలర్ వచ్చాకా సినిమాపై అంచనాలు బాగా పెరిగాయ్. ఇద్దరు ముద్దుగుమ్మలు కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సినిమా మంచి టాక్ వస్తే.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా కెరీర్లో ఓ మెట్టు పైకెక్కినట్లే అవుతుంది. చూడాలి మరి, ఫిబ్రవరి 9న ఏం జరుగుతుందో. అదే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







