యూఏఈలో 1.8 మిలియన్లు దాటిన VPN డౌన్‌లోడ్‌లు

- January 19, 2024 , by Maagulf
యూఏఈలో 1.8 మిలియన్లు దాటిన VPN డౌన్‌లోడ్‌లు

యూఏఈ: 2023లో యూఏఈ నివాసితులు తమ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) యాప్‌ల డౌన్‌లోడ్‌లు 1.83 మిలియన్లు దాటాయి. దీంతో డౌన్ లోడ్స్ మొత్తం 6.1 మిలియన్లకు చేరుకుంది.  అట్లాస్ వీపీఎన్ ద్వారా గ్లోబల్ వీపీఎన్ అడాప్షన్ ఇండెక్స్ తాజా అప్డేలో ఈ మేరకు వెల్లడించారు. గత సంవత్సరం యూఏఈలో వీపీఎన్ స్వీకరణ రేటు 61.7 శాతానికి చేరుకుంది. ఇది ఖతార్ 69.87 శాతం తర్వాత ప్రపంచంలో రెండవ అత్యధికం కావడం గమనార్హం. యూఏఈ గత నాలుగు సంవత్సరాల్లో 2023లో అత్యధిక VPN అప్లికేషన్ డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. ఇది 2020లో(కరోనా సమయంలో) చేసిన 6.09 మిలియన్ల డౌన్‌లోడ్‌లను అధిగమించింది.  

యూఏఈ ప్రభుత్వం మరియు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) మార్గదర్శకాల ప్రకారం యూఏఈలో VPN వినియోగం చట్టవిరుద్ధం కాదు. అయితే, VPNలను చట్టవిరుద్ధ మార్గాల కోసం ఉపయోగించడం లేదా నేరం చేయడం పుకార్లు, సైబర్ క్రైమ్‌లను ఎదుర్కోవడానికి సంబంధించి 2021 యూఏఈ డిక్రీ లా నంబర్ (34) ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాగే, యూఏఈ ప్రభుత్వం బ్లాక్ చేసిన వెబ్‌సైట్‌లు/కాలింగ్ అప్లికేషన్‌లు/గేమింగ్ అప్లికేషన్‌లకు యాక్సెస్ పొందడానికి IP చిరునామాను దాచడం ద్వారా VPNని ఉపయోగించడం చట్టవిరుద్ధం. యేఈ సైబర్ చట్టంలోని ఆర్టికల్ 10 ప్రకారం.. VPNలను దుర్వినియోగం చేసే వ్యక్తులు జైలు శిక్ష,  Dh2 మిలియన్ల వరకు జరిమానా విధించవచ్చు.

 2023లో అత్యధిక VPN డౌన్లోడ్ల పరంగా టాప్ 10 దేశాలు: ఖతార్, యూఏఈ, సింగపూర్, ఒమన్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, కువైట్, టర్కీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com