సౌదీలో కొత్త అడ్వెంచర్ టూరిజం ‘ది రిగ్’

- January 19, 2024 , by Maagulf
సౌదీలో కొత్త అడ్వెంచర్ టూరిజం ‘ది రిగ్’

రియాద్: పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) అనుబంధ సంస్థ అయిన ఆయిల్ పార్క్ డెవలప్‌మెంట్ కంపెనీ (OPDC).. పర్యాటక పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నది. ది రిగ్ పేరుతో ఆఫ్‌షోర్ ఆయిల్ ప్లాట్‌ఫారమ్‌లను కొత్త అడ్వెంచర్ టూరిజం డెస్టినేషన్ గా మార్చే ప్రతిష్టాత్మక మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటించింది. ఇది సౌదీ అరేబియా టూరిజాన్ని పెంచడంతోపాటు కొత్త తరహా ఉద్యోగాలను సృష్టించి, పెట్టుబడులను ఆకర్షిస్తుందని రిగ్ సీఈఓ రయిద్ బఖ్రీ తెలిపారు. 300,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న అరేబియా గల్ఫ్‌లోని అల్ జురైద్ ద్వీపం.. బెర్రీ ఆయిల్ ఫీల్డ్ సమీపంలో తీరానికి 40కిమీ దూరంలో కొత్త ప్రాంతం కొత్త పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. 2032 నాటికి వార్షికంగా 900,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్రీడలు, అడ్వెంచర్ పార్క్, ప్రపంచ స్థాయి మెరీనా మరియు హెలిప్యాడ్‌లతో కూడిన మూడు హోటళ్లతో సహా ఆకట్టుకునే సౌకర్యాల శ్రేణిని ఈ ప్రాజెక్ట్ కలిగి ఉందన్నారు. దీంతోపాటు డైవింగ్ సెంటర్, అమ్యూజ్‌మెంట్ పార్క్, స్ప్లాష్ పార్క్, ఇ-స్పోర్ట్స్ సెంటర్, థియేటర్ మరియు మల్టీ-పర్పస్ అరేనా వంటి విభిన్న శ్రేణి వాటర్ ఆధారిత కార్యకలాపాలను అందిస్తుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com