ఫిబ్రవరిలోనూ బాక్సాఫీస్ పోటీ తప్పేలా లేదు.!

- January 19, 2024 , by Maagulf
ఫిబ్రవరిలోనూ బాక్సాఫీస్ పోటీ తప్పేలా లేదు.!

సంక్రాంతికి వాస్తవానికి ఐదు సినిమాలు బరిలో నిలిచాయ్. అలాగే కొన్ని తమిళ సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధమయ్యాయ్. కానీ, నిర్మాతల చర్చోపచర్చల అనంతరం సినిమాలు క్లాష్ అవ్వకుండా కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది.
అలా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్‌కి సిద్ధమయ్యాయ్. ఈ ఏడాది ఓవరాల్‌గా సినీ ప్రియులకి సంక్రాంతి సందడి బాగానే సాగింది.
ఇదే సందడి ఫిబ్రవరి వరకూ కొనసాగనుంది. ఇక, ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆ సందడికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ఆల్రెడీ ఆ డేట్‌కి స్లాట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు మాస్ రాజా రవితేజ ‘ఈగల్’ ఒకటి. సందీప్ కిషన్ ‘ఊరు పేరు బైరవకోన’ ఇంకోటి.
ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా ఈ రెండు సినిమాలూ రిలీజ్ కానున్నాయ్. అయితే, వీటితో పాటూ, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లాల్ సలాం’ సినిమా కూడా రంగంలోకి దూకబోతోంది. సూపర్ స్టార్ సినిమాలకు తెలుగులో క్రేజ్ వేరే లెవల్. సో, బాక్సాఫీస్ వద్ద ఫిబ్రవరి పోరు కూడా గట్టిగానే వుండేలా తెలుస్తోంది. బాక్సాఫీస్ ఎప్పుడూ ఇలాగే కళకళలాడుతూ వుండాలి. ఈ పోరు ఆరోగ్యకరమే సుమా.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com