మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం
- May 30, 2016
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుల్గావ్ లోని కేంద్ర సైనిక ఆయుధాగారంలో భారీ అగ్నిప్రమాదం అనంతరం పెద్ద మొత్తంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది సైనిక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. మరో 19మంది తీవ్ర గాయాలపాలయ్యారు.భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప గ్రామంలోని వెయ్యిమందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సోమవారం అర్థరాత్రి తొలి పేలుడు సంభవించిందని, అది ఒక షెడ్డులో జరిగిందని, రెండో పేలుడు సంభవించిన చోటు మాత్రం ఇంకా తెలియరాలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఘటనా స్థలిని కేంద్ర రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









