రెసిడెన్సీ ఉల్లంఘించిన వారి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
- January 21, 2024
కువైట్: ప్రవాస రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష వ్యవధిని కువైట్ ఇప్పటివరకు ప్రకటించలేదు. గతంలో ఇటువంటి చర్యలు ప్రభావవంతంగా అమలు కాలేదన అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నివేదిక ప్రకారం.. 2020కి ముందు రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష కల్పించే ప్రణాళికను మంత్రిత్వ శాక తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం గతంలో క్షమాభిక్ష ప్రకటించబడిన సందర్భాల్లో ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని వదులుకున్నారని, ఉల్లంఘించిన వారు కువైట్‌ను వదిలిపోయేందుకు నిరాకరించారని తెలిపింది. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానా, బహిష్కరణ ఖర్చు నేరుగా బ్యాంక్ ఖాతాల నుండి డిడక్ట్ చేసేందుకు వీలుగా రెసిడెన్సీ ఉల్లంఘనదారుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను అభ్యర్థించనున్నారు. జరిమానా చెల్లించడానికి తమ వద్ద నిధులు లేవని తెలిపే వ్యక్తులను అడ్డుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 2020కి ముందు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు జరిమానాలు చెల్లించడానికి మరియు వారి స్థితిని సర్దుబాటు చేయడానికి అనుమతించేలా గత వారం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!