ప్రధాని మోదీ చేతుల మీదుగా కొలువుదీరిన బాలరాముడు

- January 22, 2024 , by Maagulf
ప్రధాని మోదీ చేతుల మీదుగా కొలువుదీరిన బాలరాముడు

అయోధ్య: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వందల ఏళ్లనాటి కల సాకారం అయింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు. అభిజిత్ లగ్నంలో ఈ మహోన్నత కార్యక్రమం పూర్తయింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకించిపోయింది. మధ్యాహ్నం 12.29నిమిషాల 8సెకన్ల నుంచి ముఖ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.. 84 సెకన్లపాటు క్రతువును పూర్తి చేశారు. అనంతరం బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిపూజ చేసి.. బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాన క్రతువు ప్రారంభమైన సమయం నుంచి హెలికాప్టర్ల ద్వారా అయోధ్య రామాలయంపై పూల వర్షం కురిసింది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సమయంలో దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగిపోయింది. టీవీల ముందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు పులకించిపోయారు. బాల రాముడి తొలి చిత్రాన్ని చూసి భక్తిపారవశ్యంలో పరవశించిపోయారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడిచేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో అభయమిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com