అనన్యుడు

- January 22, 2024 , by Maagulf
అనన్యుడు

ధర్మాచరణకే జనియించి
అందరిని ఆదుకొను ఆశ్రితవత్సలుడు 
నీలిమేఘవర్ణంతో భాసిల్లే చక్కనోడు
కరుణించి మా మనమున నిలిచినోడు
కష్ట సమయంలో ఆదుకొనే ఆపద్భాందవుడు.

రాజ్యం తృణప్రాయంగా వీడిన 
ఒకమాట, ఒక బాణం, ఒకే పత్నీ అనే త్రిసూత్రమే శ్వాసగా వనమున కేగి వనవాసం చేసిన
నీ చరణస్పర్శతో అవనియంతయూ పులకించిన 
తండ్రి మాట జవదాటని 
ముక్తిని ప్రసాదించే సాకేతరాముడు
రావణుని సంహరించిన 
సాకేత సార్వభౌముడు 
నీ నామ స్మరణతో 
పాపాలు అగ్నిలో భళభళమని దహించేను
నీ గుణగణాలు వర్ణించ నా తరమా 
సత్యమార్గాన్నీ హుందాగా నిర్వహించి
జానకిని పరిణయమాడి కుటుంబ విలువలు
లోకానికి తెలిపిన నిరాడంబర అవతారుడు.

నమ్మిన బంటు హృదిలో కొలువై ఏ ప్రతిఫలం
ఆశించని *అనన్యుడు*

కమనీయం రమణీయం జన్మధన్యం 
కనీవినీ ఎరుగని బాలరాముని
ప్రతిష్ఠా మహోత్సవం.

--యామిని కోళ్ళూరు(అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com