‘దేవర’ రిలీజ్ డేట్ వాయిదా పడిందిగా.!
- January 24, 2024
ఎన్టీయార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ను ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్లు. గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని డేట్‌తో సహా ప్రకటించేశారు.
కానీ, సీన్ రివర్స్ అయ్యింది. సినిమా రిలీజ్ వాయిదా పడిపోయింది. ఆల్రెడీ ఈ విషయమై గుసగుసలు బయటికొచ్చేశాయ్. ‘దేవర’ సినిమా రిలీజ్ వాయిదా పడబోతోందంటూ జోరుగా ప్రచారం జరిగింది.
అదే ఇప్పుడు నిజమైంది. దసరాకి ‘దేవర’ని ముస్తాబు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. కాదు కాదు సంక్రాంతి అయితే బెటర్‌గా వుంటుందేమో అనుకుంటున్నారు.
అసలు వాయిదాకి కారణమేంటీ.? విలన్ పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ షూటింగ్లో గాయపడడం ఓ కారణం కాగా, ఎలక్షన్ల హీట్ పెరిగిపోవడం ఇంకో కారణం అంటున్నారు. ఏమో మొత్తానికి ‘దేవర’ అయితే, ఇప్పట్లో వచ్చే సినిమా కాదని ఓ వర్గం ప్రేక్షకులు ఫిక్సయిపోతున్నారు. ఎన్టీయార్ ఫ్యాన్స్ మాత్రం ఢీలా పడిపోతున్నారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









