మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా ITEC దినోత్సవం
- January 24, 2024
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం జనవరి 18వ తేదీన ఎంబసీ ప్రాంగణంలో 'ఇండియన్ టెక్నికల్ & ఎకనామిక్ కోఆపరేషన్' (ITEC) దినోత్సవాన్ని జరుపుకుంది. 'ఒమన్ విజన్ 2040' లక్ష్యాలను సాధించడానికి ఒమన్ ప్రయాణంలో భారత ప్రభుత్వం బలమైన భాగస్వామి అని ఈ సంధర్భంగా వక్తలు చెప్పారు. దీని కోసం భారత ప్రభుత్వం యొక్క ITEC కార్యక్రమం కీలక ఫెసిలిటేటర్గా ఉంటుందన్నారు. ప్రత్యేక శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి మరియు నైపుణ్యాభివృద్ధి ఈ ప్రయాణంలో అంతర్భాగం, దీనికి ITEC ఒక ఆదర్శ వేదిక అని పేర్కొన్నారు. ఒమానీ అభ్యర్థులకు వారి ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కస్టమైజ్డ్ కోర్సులను నిర్వహించవచ్చని వారు హామీ ఇచ్చారు. ITEC కోర్సుల యొక్క ప్రయోజనాల గురించి వివరిస్తూ విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందించడమే కాకుండా ఇతర దేశాల నుండి శిక్షణ పొందే వారితో భారతదేశం మరియు దాని సంస్కృతి, సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాకారిణి జుంపా చక్రవర్తి, ఆమె విద్యార్థులు కథక్ నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









