సూపర్ స్టార్ కృష్ణ గారి 74వ పుట్టిన రోజు శుభాకాంక్షలు
- May 31, 2016
ఈ రోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారి 74వ పుట్టిన రోజు. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ చేసిననని ప్రయోగాలు మరే నటుడు చేసి ఉండడు. హీరోగా మూడువందలకు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ వారసుడు వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. తాజాగా శ్రీ శ్రీ సినిమాలో నటిస్తున్న కృష్ణ ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించాడు. కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి, ఈయనా బి.యస్.సి. వరకు చదువుకున్నారు. 1962 లో ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమారంగంలో 350పైగా సినిమాల్లో నటించారు. సినీ పరిశ్రమలో మంచి మనిషిగా కూడా పేరు పొందాడు. 2008 లో కృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందాడు. 2009 లో, భారతదేశం ప్రభుత్వం భారతీయ సినిమా తన సేవలకు గాను పద్మ భూషణ్ గౌరవించింది. రాజకీయ రంగ ప్రవేశం కూడ చేసిన కృష్ణ 1989 లో 9వ లోక్సభ కు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. కృష్ణ తనయులు రమేష్ బాబు, మహేష్ బాబులు హీరోలుగా తెలుగు తెరకు సుపరిచితులు. కూతురు మంజుల వెండితెరపై అప్పుడప్పుడూ నటిస్తూ. సినిమా నిర్మాణ రంగంలో ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు









