నడకతోనూ మధుమేహానికి చెక్ పెట్టేయొచ్చా.?
- January 24, 2024
మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే చాలు.. జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. అయితే, మందులు వాడుతూనే డైట్ ఒకింత.. దినచర్యలోని కొన్ని మార్పులు ఇంకొంత.. ఇలా ఓ పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మధుమేహం వున్నా హాయిగా జీవించేయొచ్చు.
డైట్ సంగతి అటుంచితే, నడక అనేది చాలా చాలా దీర్ఘకాలిక వ్యాధులకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. అలాగే, మధుమేహులకు కూడా నడక ఓ వరమే.
అయితే, మధుమేహం వున్న వారు ఓ పర్టిక్యులర్ వేగంతో ప్రతీరోజూ వాకింగ్ చేస్తే ఆ ఫలితాలు మరోలా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే.. మధుమేహం అదుపులో వుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఒకవేళ మధుమేహం లేని వాళ్లకయితే, ఇదే నడక తీరును ఫాలో చేస్తే.. భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువని ఓ సర్వేలో తాజాగా తేలింది.
అంతేకాదు, ఈ వేగాన్ని గ్రాడ్యుయల్గా పెంచుకుంటూ పోతే.. ఇంకా మంచి ఫలితాలు చూడొచ్చట. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుంచి తపించుకునే అవకాశం మరో 15 శాతం పెరుగుతుందట. అయితే శరీర సామర్ధ్యాన్ని కూడా దృస్టిలో పెట్టుకుని ఈ నడక వేగాన్ని ఫాలో చేయాలని నిపుణుల హెచ్చరిక.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









