అన్ని పంచాయతీల్లో వైఫై సౌకర్యం

- May 31, 2016 , by Maagulf
అన్ని పంచాయతీల్లో వైఫై సౌకర్యం

భారత్‌ నెట్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా 2018 అక్టోబర్‌ నాటికి అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి తెస్తామని టెలికాం సెక్రటరీ జేఎస్‌ దీపక్‌ తెలిపారు. సెల్యూలార్‌ ఆపరేషన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వార్షిక సమావేశంలో భాగంగా 'డేటా కనెక్టివిటీ ఫర్‌ నెక్ట్స్‌ బిలియన్‌' అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్‌ విస్తరణపై దీపక్‌ మాట్లాడారు.
ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై సదుపాయం తీసుకొస్తామన్నారు. తొలి దశలో భాగంగా 2017 మార్చి నాటికి లక్ష గ్రామపంచాయతీల్లో 80-100 ఎంబీపీఎస్‌ స్పీడుతో వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటుచేస్తామన్నారు. రెండో దశలో అండర్‌గ్రౌండ్‌ ఫైబర్‌, రేడియో శాటిలైట్‌ సదుపాయంతో అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై తీసుకొస్తామన్నారు. ప్రతి పౌరుడికి నెలకు రూ.100కే డేటాను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com