ప్రభుత్వ వైద్య ఉద్యోగులకు శుభవార్త
- May 31, 2016
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల (సెంట్రల్ హెల్త్ సర్వీసెస్) పరిధిలోని వైద్యులకు తీపి కబురు. ప్రభుత్వ డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాల పెంపుకు ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశంలో వైద్య సేవల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా వైద్యుల పదవీ విమరణ వయసును పెంచుతామని... రెండేళ్ల పాలన విజయోత్సవ సభ వేదికగా ప్రధాని మోదీ సహరాన్ పూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల పదవీ విరమణ పెంపు నిర్ణయానికి ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వయో పరిమితి పెంపు నిబంధన నేటి నుంచి అమల్లోకి రానుంది. కేంద్రం లేదా రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 62 సంవత్సరాలుగా ఉంది. తాజాగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో వైద్యుల పదవీ విరమణ వయసు రాష్ట్రాల్లో అయినా, కేంద్ర ప్రభుత్వంలో అయినా 65 ఏళ్లకు ఉంటుంది. కాగా దేశంలో నెలకొన్న ప్రభుత్వ వైద్యుల కొరతను అధిగమించడానికి కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మాట్లాడుతూ వైద్యుల పదవీ విరమణ వయసు పెంచడం వల్ల మరింత మె
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









