భారత్, సౌదీ అరేబియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ..

- January 29, 2024 , by Maagulf
భారత్, సౌదీ అరేబియా సంయుక్త సైనిక విన్యాసాలు షురూ..

భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.

'సదా తన్సీక్' పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10వరకు కొనసాగనున్నాయి. ఇందులో సౌదీ అరేబియా నుంచి 45 మంది, భారత ఆర్మీకి చెందిన 45 మంది సైనికులతో కూడిన బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్‌ పాల్గొననున్నారు. ఈ డ్రిల్స్‌లో మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్‌లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, హౌస్ ఇంటర్‌వెన్షన్ డ్రిల్స్, రిఫ్లెక్స్ షూటింగ్, స్లిథరింగ్, స్నిపర్ ఫైరింగ్‌ల ఏర్పాటు ఉంటుంది. 'యునైటెడ్ నేషన్స్ చార్టర్ VII అధ్యాయం ప్రకారం సెమీ-ఎడారి భూభాగంలో ఉమ్మడి కార్యకలాపాల కోసం దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యాయామం లక్ష్యం. ఇది ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర చర్య, బంధుత్వం, స్నేహాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది' అని ఆర్మీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com