విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా..
- May 31, 2016
అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ. అరుంధతి సినిమా తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో కనిపించటం మానేశాడు. తెలుగు తెర మీద సక్సెస్ దూరం కావటంతో కన్నడలో ఓ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.అయితే కోడి రామకృష్ణ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో కన్నడ స్టార్ విష్ణువర్ధన్. 2009లోనే చనిపోయిన విష్ణువర్థన్ ఇప్పుడు హీరోగా ఎలా నటిస్తున్నాడని అనుకుంటున్నారా..? అప్పట్లో కలిసుందాం రా.. యమదొంగ లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ ను మరోసారి తెరమీద చూపించినట్టుగా.., ఈ సినిమాలో విష్ణువర్థన్ ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా చూపించబోతున్నారు.అప్పట్లో అవి కేవలం ఒక సీన్‌కు లేదా ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ చనిపోయిన నటుడు హీరోగా ఓ పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించటం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం విశేషం. 1972లో విష్ణువర్థన్ హీరోగా తెరకెక్కిన నాగరాహువు సినిమాను తరువాత ఉపేంద్ర హీరోగా రీమేక్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అదే సినిమాను అదే పేరుతో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. చనిపోయిన విష్ణువర్ధన్ ను ఈ సినిమాలో హీరోగా చూపించటం కోసం ఏడు దేశాల్లోని 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించారట. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







