యూఏఈలో వర్షాలు: వాహనదారులకు అలెర్ట్
- February 01, 2024
యూఏఈ: అబుధాబిలోని అనేక ప్రాంతాలలో బుధవారం (జనవరి 31) తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాబోయే వర్షపు రోజులలో సురక్షితమైన పద్ధతులను అనుసరించాలని వాహన డ్రైవర్లను పోలీసులు హెచ్చరించారు. సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని, కుండపోత వర్షం సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. వేగ పరిమితులను పాటించాలని, సడన్ బ్రేకింగ్‌ను నివారించాలని మరియు విజిబిలిటీ దెబ్బతింటుంటే రోడ్డు పక్కన ఆగాలని దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డ్రైవర్లను కోరింది. అబుదాబి ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్ వాహనదారులు భద్రతా నియమాలను పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ మరియు డ్రిఫ్టింగ్ను నివారించాలని, వర్షపాతం సమయంలో ట్రాఫిక్ చట్టాలను అనుసరించాలని కోరారు. భారీ వర్షాల సమయంలో డ్రైవర్లు లోయలు మరియు నీటి వనరుల నుండి దూరంగా ఉండాలని సూచించారు. లేకుండా - 2,000 దిర్హామ్ జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు, 60-రోజుల వాహనాల జప్తు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేమతో కూడిన ఆగ్నేయ గాలులతో పాటు నైరుతి నుండి విస్తరించి ఉన్న ఉపరితల అల్పపీడనం వల్ల యూఏఈ ప్రభావితమవుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









