నితిన్‌కి పవన్ టైటిల్ అయినా కలిసొస్తుందా.?
- February 01, 2024పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్‌కి చాలా చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తన సినిమాల్లో ఎక్కడో చోట ఇరికించేస్తుంటాడు నితిన్. చాలా సందర్భాల్లో ఆయనకు అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటానని నితిన్ ఓపెన్‌గా చెప్పడం విన్నాం కూడా.
అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తూ.. ఆయన సినిమా టైటిల్‌ని తన సినిమాకి పెట్టేసుకున్నాడు నితిన్. గతంలోనే ఈ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే నితిన్ బిజీగా వున్నాడు.
ఇటీవలే ‘ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముుదుకొచ్చాడు నితిన్. ధియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందింది.
ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు నితిన్. అందుకే ఇప్పుడు ఎలాగైనా తన అభిమాన హీరో సినిమా టైటిల్‌తో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడట. అందుకే ‘తమ్ముడు’ సినిమా విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట.
వేణు శ్రీరామ్ విషయమున్న డైరెక్టరే. అయితే, ఆయన ట్రాక్ రికార్డ్ ఏమంత బాగా లేదు. లక్కు కలిసొచ్చి.. ‘తమ్ముడు’ హిట్టయితే.. ఇటు వేణు శ్రీరామ్‌కీ, అటు నితిన్‌కీ ఇద్దరికీ మంచిదే.!
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు