బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్‌కు మంచి స్పందన

- February 04, 2024 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్‌కు మంచి స్పందన

బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం 2024 మొదటి ఓపెన్ హౌస్‌ను నిర్వహించింది. దీనికి రాయబారి హిస్ ఎక్సలెన్సీ వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు మలయాళంలో నిర్వహించిన కార్యక్రమంలో 60 మందికి పైగా భారతీయ పౌరులు పాల్గొన్నారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయబార కార్యాలయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జాకబ్ సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 12న ఎంబసీ నిర్వహించిన "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"లో భారతీయ సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాన్సులర్ మరియు లేబర్ విషయాలకు సంబంధించిన చాలా కేసులు గత సంవత్సరం పరిష్కరించబడ్డాయని, పెద్ద సంఖ్యలో అవసరమైన వ్యక్తులకు సహాయం అందించబడిందన్నారు. ప్రవాస సంఘం సంరక్షణలో నిరంతర మద్దతు, సహకారం కోసం స్థానిక ప్రభుత్వ అధికారులకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com