Dh17,000 నీటి బిల్లు.. స్పందించిన డెవలపర్.. కీలక సూచనలు
- February 07, 2024
యూఏఈ: డమాక్ హిల్స్ 2 నివాసితులకు నీటి బిల్లుల పెంపు గురించి డమాక్ ప్రాపర్టీస్ కమ్యూనిటీ అడ్వైజర్ జారీ చేసింది. సెలవు రోజుల్లో బిల్లులు పెరిగే ప్రమాదాన్ని అరికట్టడానికి వాటర్ వాల్వ్‌లు, ఎలక్ట్రిక్ బ్రేకర్లు మరియు గ్యాస్ వాల్వ్‌లను మూసివేయాలని సూచించింది. ఇటీవల నివాసితులకు విపరీతమైన నీటి బిల్లులు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. కొందరు నివాసితులకు Dh17,000 వరకు వాటర్ బిల్లులు రావడం సంచలనంగా మారింది. బ్రిటిష్ రెసిడెంట్ పీటర్ స్పెన్సర్ సెలవులో ఉన్నప్పుడు నీటి వినియోగం కోసం Dh4,327 బిల్లును అందుకున్నాడు. డిసెంబరు 26 - 31 మధ్య కేవలం ఐదు రోజుల వ్యవధిలో తన మీటర్ 80,000 గ్యాలన్ల వినియోగాన్ని నమోదు చేసిందని పేర్కొంటూ ఒక విల్లాలో నివసించే స్పెన్సర్.. నీటి వినియోగంలో వ్యత్యాసాన్ని చూసి షాక్ అయ్యారు. “సాధారణంగా తమ నీటి వినియోగం 60 గ్యాలన్ల వరకు వుంటుంది. వాటర్ లీక్ కారణంగా అది దాదాపు 80,000 గ్యాలన్లకు చేరుకుంది”అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









