‘లాల్ సలాం’ పై అంచనాలు పెరిగిపోయాయ్ సుమా.!

- February 07, 2024 , by Maagulf
‘లాల్ సలాం’ పై అంచనాలు పెరిగిపోయాయ్ సుమా.!

రజనీకాంత్ గెస్ట్ రోల్ పోషిస్తున్న సినిమా ‘లాల్ సలాం’. రజనీకాంత్‌తో పాటూ ఈ సినిమాలో సీనియర్ నటి జీవిత.. మరో సీనియర్ నటి నిరోషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్ గెస్ట్ రోల్ అయినప్పటికీ చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాలో. రజనీకాంత్ సినిమాలకు సౌత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బోలెడంత క్రేజ్ వున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాగే, ‘లాల్ సలాం’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ అయినప్పటికీ అంచనాలు బాగా వున్నాయ్. రజనీకాంత్ ముద్దుల తనయ ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఆసక్తికరమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఓ అతిధి పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేయనున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ సినిమాకి అనేక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుండడంతో అంచనాలు బాగున్నాయ్.

తెలుగులో ఈ సినిమా ‘ఈగల్’కి పోటీకి రిలీజ్ అవుతోంది. చూడాలి మరి, ఈ సర్‌ప్రైజింగ్ మూవీని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారా.? లేక మాస్ రాజా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడతారా.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com