రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్.!
- February 08, 2024
అవునండీ మీరు విన్నది నిజమే.! గతంలోనే జాన్వీ కపూర్, రామ్ చరణ్ జోడీ కుదరాల్సి వుంది. కానీ కుదరలేదు. ఇప్పుడెలాగూ జాన్వీ కపూర్.. ‘దేవర’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
సో, తెరంగేట్రం ఎలాగూ జరిగింది కాబట్టి.. ఇప్పుడిక స్టార్ హీరోలకు జోడీగా జాన్వీ కపూర్ పేరు లిస్టులో యాడ్ అయిపోయింది. ఆ నేపథ్యంలోనే రామ్ చరణ్ తాజా మూవీలో జాన్వీ కపూర్‌ని హీరోయిన్గా తీసుకున్నారని సమాచారం అందుతోంది.
బుచ్చిబాబు సన, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట రవీనా టాండన్ కూతురు రషా తదానీని హీరోయిన్గా అనుకున్నారు.
అయితే, ఆ ప్లేస్‌లోకి జాన్వీ కపూర్ పేరు వచ్చి చేరింది. అయితే, ఈ సమాచారం అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ, జాన్వీ కపూర్ నటనా టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే.
సో, రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ అయితేనే బాగుంటుంది... అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఈ ప్రచారమే నిజం కానుందేమో.!
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









