తూర్పు జెరూసలేం పాలస్తీనా.. సమస్యకు ఇదే పరిష్కారం!

- February 09, 2024 , by Maagulf
తూర్పు జెరూసలేం పాలస్తీనా.. సమస్యకు ఇదే పరిష్కారం!

రియాద్: కాల్పుల విరమణకు, గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణకు ముగింపు పలకాలని ప్రధాన అరబ్ దేశాల సమావేశం పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ యుద్ధంలో తాజా పరిణామాలపై చర్చించడానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గురువారం రియాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ హాజరయ్యారు. ఆయనతోపాటు  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి మరియు జోర్డాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మరియు ప్రవాస వ్యవహారాల మంత్రి అమాన్ అల్-సఫాది,  ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ షుక్రీ మరియు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి మరియు పాలస్తీనా పౌర వ్యవహారాల మంత్రి హుస్సేన్ అల్-షేక్ హాజరయ్యారు. గాజా స్ట్రిప్‌పై యుద్ధాన్ని ముగించాలని, కాల్పుల విరమణను పాటించాలని, అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా పౌరుల రక్షణను చేపట్టాలని, గాజా స్ట్రిప్‌లోకి మానవతా సహాయం ప్రవేశానికి ఆటంకం కలిగించే అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు.  పాలస్తీనా శరణార్థుల పట్ల మానవతావాద మిషన్లకు మద్దతు ఇవ్వడంలో తమ పాత్రను పోషించాలని మంత్రులు కోరారు. అంతర్జాతీయ తీర్మానాలకు అనుగుణంగా తూర్పు జెరూసలేం రాజధానిగా జూన్ 4, 1967 తరహాలో పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించాలని చెప్పారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో గాజా స్ట్రిప్ అంతర్భాగమని సమావేశం పునరుద్ఘాటించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com