‘మృణాల్ ఠాకూర్‌కి ఆ ప్యాన్ వరల్డ్ మూవీ ఛాన్స్ నిజమేనా.?
- February 10, 2024
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో మృణాల్ ఠాకూర్ పేరు కూడా మొదటి వరుసలో వుందని చెప్పొచ్చు.
ఇంతవరకూ టాప్ రేస్‌లో వున్న రష్మిక మండన్నా, పూజా హెగ్ధే బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుండడం వల్ల.. తెలుగులో సంయుక్తా మీనన్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు రైజింగ్‌లోకి వచ్చారు.
సో, ప్రాజెక్ట్ ఏదైనా ముందుగా వీరి పేర్లే వినిపిస్తున్నాయ్. శ్రీలీల పేరు కూడా ఈ లిస్టులో వున్నప్పటికీ.. రొటీన్.. బోరింగ్.. అనే ఫీల్ క్రియేట్ అవుతోంది శ్రీలీలతో ఈ మధ్య.
దాంతో, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరి మీదే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల ద్రుష్టి.. గోల్డెన్ ఛాన్స్ అనాలో ఏదైనా అనుకోండి.. ఈ ముద్దుగుమ్మలయితే, నక్క తోక తొక్కి వచ్చారనే చెప్పొచ్చు.
ఇక, లేటెస్ట్‌గా మృణాల్ ఠాకూర్ పేరు రాజమౌళి సినిమా కోసం వినిపిస్తుండడం విశేషం. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్దలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నారట.
త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందనీ తెలుస్తోంది. వెరీ సూన్.. మృణాల్‌కి స్ర్కీన్ టెస్ట్ చేయబోతున్నాడట జక్కన్న. ఆల్ సెట్ అయితే.. మృణాల్ కూడా రాజమౌళి హీరోయిన్ అయిపోయినట్లే.!
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







