అబుధాబి లో మొదటి హిందూ దేవాలయం.. ప్రారంభించనున్న మోడీ
- February 10, 2024
దుబాయ్: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటన చేస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం 2015 నుండి ప్రధాని మోడీ యూఏఈ కి ఇది ఏడవ పర్యటన.. గత ఎనిమిది నెలల్లో ఆయన మూడవ పర్యటన. ఈ పర్యటనలో ప్రధాని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడానికి, బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకునే మార్గాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు.
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను కూడా ప్రధాని కలుస్తారు. తన ఆహ్వానంపై ప్రధాన మంత్రి దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024కి గౌరవ అతిథిగా హాజరవుతారు. సమ్మిట్‌లో మోడీ ప్రత్యేక కీలకోపన్యాసం చేస్తారు. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయమైన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో జరిగే కార్యక్రమంలో ఆయన యూఏఈ లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 2015లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూఏఈ లో జరిపిన చారిత్రాత్మక పర్యటన తర్వాత, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







