‘మిస్టర్ బచ్చన్’.! మాస్ రాజా ఎంత ఘాటు ప్రేమయో.!
- February 15, 2024మాస్ రాజా రవితేజ లెటెస్ట్‌గా ‘ఈగల్’ సినిమాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వెంటనే మరో సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ మాస్ రాజా, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్లో వుందన్న సంగతి కూడా తెలిసిందే.
శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా వాలైంటైన్ డే స్పెషల్‌గా మాస్ రాజా అభిమానులకు ఓ గాఢమైన రొమాంటిక్ గిప్ట్ వదిలాడు. అదే తన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్.
రొమాంటిక్ అంటే.. అలాంటిలాంటి రొమాన్స్ కాదు మరి. ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనాల్సిందే ఆ పోస్టర్ చూసి. కుర్చీలో కూర్చున్న మాస్ రాజా ఒళ్లో తన ప్రేయసిని ఘాటుగా స్టైలిష్ పోజులో కౌగిలించుకున్న చిత్రమది.
ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ మాస్ రాజా ఘాటు ప్రేమ కౌగిలిలో ఒదిగిపోయిన ఆ ముద్దుగుమ్మ ఎవరంటారా.? ఆమె పేరు భాగ్యశ్రీ బోర్సే.. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. సహజంగానే హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్లు చాలా చాలా అందంగా వుంటారు. ఈ కొత్త భామను ఇంకెంత అందంగా చూపించి వుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు