జిసిసి దేశాల్లో 17 మిలియన్ ఉద్యోగాలు
- June 02, 2016
జిసిసి దేశాలు వలసదారులకు 17 మిలియన్ ఉద్యోగావకాశాల్ని కల్పిస్తూ, పేదరిక నిర్మూలనలో తమవంతు బాధ్యతను పోషిస్తున్నాయని జెనీవాలో జరుగుతున్న జాయింట్ జిసిసి క్యాబినెట్, అంతర్జాతీయ కార్మిక కాన్ఫరెన్స్‌లో వెల్లడించింది. కాన్ఫరెన్స్ - 105వ సెషన్లో సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ డాక్టర్ మౌఫర్రెజ్ బిన్ సాద్ హక్బాని మాట్లాడుతూ, వలసదారులు తమ స్వదేశాలకు 80 బిలియన్ డాలర్లను జిసిసి దేశాల ఉంచి తీసుకెళుతున్నట్లు చెప్పారు. అది వారి వారి దేశాల్లో పేదరికాన్ని తగ్గించడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 17 మిలియన్ కార్మికులు జిసిసి దేశాలకు ఆర్థికంగా ఊతాన్నిస్తున్నారని వివరించారాయన. యూఎన్ 2030 ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు జిసిసి దేశాలు సిద్ధంగా ఉన్నాయనీ, పేదరిక నిర్మూలన కోసం యూఎన్ చేపట్టే అన్ని కార్యక్రమాలకూ జిసిసి మద్దతు ఉంటుందని చెప్పారు హక్బానీ. జిసిసి దేశాలు మహిళలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తగిన అవకాశాల్ని అన్వేషిస్తోందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







