జాన్వీ కపూర్ లిస్టులో నెక్స్ట్ సూపర్ స్టారేనా.?
- February 20, 2024ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలయిన జాన్వీ కపూర్‌పై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆప్యాయత చూపించారు.
కానీ, ఆమె నటన స్టార్ట్ చేసి దాదాపు పదేళ్లు పైబడినా సౌత్‌పై అదీ తెలుగు సినిమాపై అంతగా ఆసక్తి చూపించలేదెందుకో. ఇదిగో అదిగో జాన్వీ వస్తుందట.. అని ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకున్నారు.
ఇన్నాళ్లకి సడెన్‌గా జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అదే ‘దేవర’ సినిమాతో. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, మరో క్రేజీ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో జాన్వీ ఎంపికైంది.
ఇక, రాజమౌళి తెరకెక్కించబోయే ప్యాన్ వరల్డ్ మూవీలోనూ జాన్వీ పేరు పరిశీలనకొచ్చిందట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏమో రాజమౌళి కోరుకుంటే.. జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో భాగం చేసేయడం ఎంత సేపు.! ఎంతైనా రాజమౌళి ప్రాజెక్ట్ అంటే, అది గ్లోబల్ ప్రాజెక్టేగా.! సో, అలా జాన్వీ కపూర్ నెక్స్ట్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్ అవుతుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి