‘ఆపరేషన్ వాలంటైన్’.! ఏం జరిగినా సరే చూసుకుందాం.!
- February 21, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సారి ఏదో మ్యాజిక్ చేసేలానే వున్నాడు. ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా రుద్ర చేయబోయే సాహసాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్.
బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా కాకుండా.. హీరోకి ధీటైన పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. వరుణ్ తేజ్ తనదైన కటౌట్, స్టైలింగ్‌తో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్ర పాత్రలో ప్రామిసింగ్‌గా కనిస్తున్నాడు.
‘ఏం జరిగినా సరే చూసుకుందాం..’ అని చాలా కసిగా డైలాగులు పలుకుతున్నాడు వరుణ్ తేజ్. త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఈ సినిమా వరుణ్ తేజ్‌కి మంచి విజయం అందించాలని ఆశిద్దాం. అంతేకాదు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సబ్జెక్టులు తెరకెక్కుతుంటాయ్.
కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రతాప్ సింగ్. చూడాలి మరి, ‘ఆపరేషన్ వాలంటైన్’ మిషన్ సక్సెస్ అవుతుందో లేదో.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







