రియాద్‌లో 8 టన్నుల ఉల్లి సీజ్

- February 23, 2024 , by Maagulf
రియాద్‌లో 8 టన్నుల ఉల్లి సీజ్

రియాద్: రియాద్‌లోని ఒక గిడ్డంగిలో నిల్వ చేసిన ఎనిమిది టన్నుల ఉల్లిపాయలను వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంది. వాటిని వెంటనే మార్కెట్‌లకు త‌ర‌లించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది. దక్షిణ రియాద్‌లో ఎనిమిది టన్నుల కంటే ఎక్కువ ఉల్లిపాయలను నిల్వ చేసిన వాణిజ్య సంస్థ యొక్క గోదాంపై మంత్రిత్వ శాఖ నుండి తనిఖీ బృందాలు దాడి చేశాయి.  సీజ్ చేసిన ఉల్లిని వినియోగదారులకు విక్రయించడానికి మార్కెట్‌లలోకి త‌ర‌లించే ప్రక్రియను చేప‌ట్టిన‌ట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com