మలేషియా ప్రధానమంత్రితో అబ్దుల్లా కమెల్ కీలక సమావేశం
- February 25, 2024
జెడ్డా: ఇస్లామిక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సలేహ్ కమెల్ శుక్రవారం కౌలాలంపూర్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ ఛాంబర్ సెక్రటరీ జనరల్ యూసఫ్ ఖలావి, డాక్టర్ ఫసిహర్ హసన్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మలేషియాలో ముఖ్యంగా సౌదీ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై షేక్ అబ్దుల్లా కమెల్ కు వివరించారు. 2023 సంవత్సరంలో మలేషియా తన చరిత్రలో అత్యధిక పెట్టుబడి రేటును 329.5 బిలియన్ మలేషియా రింగ్‌గిట్‌లతో సాధించిందని ఆయన వివరించారు. సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడం వల్ల మలేషియా కంపెనీలు, శ్రామిక శక్తి వృద్ధి చెందడంతోపాటు వివిధ దేశాల నుండి నైపుణ్యాలను పొందడం ఖాయమని ప్రధాని అన్వర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'