కల్బాకు భారీ వర్ష సూచ‌న.. భ‌యాందోళ‌న‌లో నివాసితులు

- February 25, 2024 , by Maagulf
కల్బాకు భారీ వర్ష సూచ‌న.. భ‌యాందోళ‌న‌లో నివాసితులు

యూఏఈ: వరదల నుండి కల్బా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కాగా, ఆదివారం మరియు సోమవారాల్లో యూఏఈని మ‌రో తుఫాన్ తాక‌నుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్బా నివాసితులు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది నివాసితులు ఇటీవలి వరదల నుండి నేర్చుకున్న‌ పాఠాలతో ప్రమాద తీవ్ర‌త‌ను తగ్గించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పాస్‌పోర్ట్, ముఖ్యమైన పత్రాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఆభరణాలు వంటి మా వస్తువులను సురక్షితంగా ఉంచడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్లు కల్బా నివాసి అబూబకర్ సిద్ధిక్ చెప్పారు.  అవసరమైన వస్తువులు మరియు అత్యవసర సామాగ్రి సిద్ధం చేసుకుంటున్నామ‌ని, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప‌లువురు నివాసితులు తెలిపారు.  ఈసారి వరదలు రాకూడదని ఆశిస్తున్నాను. లోతట్టు ప్రాంతాల నుండి చాలా మంది తమ బంధువులు మరియు స్నేహితుల ప్రదేశాలకు కొన్ని రోజులు మకాం మార్చాలని ప్లాన్ చేసార‌ని కైరాలీ కల్చరల్ అసోసియేషన్ ఫుజైరా, కల్బా యూనిట్ అధ్యక్షుడు మహమ్మద్ నబీల్ తెలిపారు. వాహనాలను రక్షించడానికి, కల్బా నివాసితులు తమ కార్లను ఎత్తైన ప్రదేశంలో పార్క్ చేయడం ద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com