వాటర్ బెలున్స్ విసిరితే..500 దీనార్ల వరకు జరిమానా
- February 25, 2024
కువైట్: వాటర్ బెలున్స్ విసిరితే 500 దీనార్ల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు పర్యావరణ పబ్లిక్ అథారిటీ యొక్క తాత్కాలిక డైరెక్టర్ జనరల్ సమీరా అల్-కందారి హెచ్చరించారు. పౌరులు మరియు ప్రవాసులు కువైట్‌లో జాతీయ సెలవుదిన వేడుకల్లో పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ లా ఆర్టికల్ 33కి అనుగుణంగా బెలూన్ పారవేయడంతోపాటు చెత్తను వేయకుండా ఉండాలని, ఉల్లంఘించిన వారికి 50 నుండి 500 దీనార్‌ల జరిమానా విధించనున్నట్లు అల్-కందారి తెలిపారు. పర్యావరణ నిబంధనలను అమలు చేయడానికి ఏజెన్సీల సిబ్బందితో సహా ఇన్‌స్పెక్టర్ల బృందాలు వేడుక జరిగే ప్రదేశాలలో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. జాతీయ సెలవు రోజులలో కాలుష్యాన్ని తగ్గించడానికి, అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పర్యావరణ అధికారుల ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







