కటారాలో మహాసీల్ ఫెస్టివ‌ల్ ప్రారంభం

- February 26, 2024 , by Maagulf
కటారాలో మహాసీల్ ఫెస్టివ‌ల్ ప్రారంభం

దోహా: కటారా 8వ ఎడిషన్ మహాసీల్ ఫెస్టివల్‌ను కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆదివారం ప్రారంభించింది. ఏప్రిల్ 15 వరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ మరియు ఖతారీ రైతుల ఫోరం సహకారంతో ఈ కార్యక్రమం కొన‌సాగుతుంది. ఈ సందర్భంగా మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ ఇంజనీర్‌ యూసఫ్‌ ఖలీద్‌ అల్‌ ఖులైఫీ మాట్లాడుతూ.. ఖతార్‌ రైతుల ఫోరమ్‌తో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. స్థానిక ఉత్పత్తులను సంరక్షించడం, సరఫరా చేయడం మరియు మార్కెటింగ్ చేయడంలో ఫెస్టివ‌ల్ పాత్రను ప్రశంసించారు.  అల్ ఖులైఫీ ఈ ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఒక సాంస్కృతిక వేదికను ఏర్పరుస్తుందని, దీని ద్వారా తేనె వంటి ప్రదర్శిత ఉత్పత్తులతో పాటు స్థానిక ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పువ్వులు మరియు వివిధ నర్సరీలు సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. ఖతార్ రైతు ఎదుర్కొంటున్న సవాళ్లకు అల్ ఖులైఫీ ప‌రిష్కారం చూపుతుంద‌న్నారు. స్థానిక ఉత్పత్తి ప్రధానంగా నీటి వినియోగంపై ఆధారపడి ఉంటుందని, నీటి వనరులను సరైన రీతిలో ఉపయోగించుకునేలా మరియు దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో పోటీ పడేలా రైతులను ప్రోత్సహిస్తుంద‌ని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com