తెలుగు సినీ రచయిత సిరాశ్రీకి గౌరవ డాక్టరేట్
- February 26, 2024
దుబాయ్: అమెరికాలోని వయోమింగ్ కేంద్రంగా గల గ్లోరీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2024 కి గాను దుబాయ్ లో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, సేవాతత్పరులను గుర్తించి డాక్టరేట్లను ఇవ్వడం జరిగింది.
భారత్, పాకిస్తాన్, యూ,ఎ.ఈ, నేపాల్, కెనెడా, ఈజిప్ట్, ఐవొరీ కోస్ట్ దేశాలకు చెందిన 23 మందికి ఈ గౌరవ డాక్టరేట్లను స్నాతకోత్సవంలో ప్రదానం చేయడం జరిగింది.
దుబాయ్ లో జరిగిన ఈ వేదుకలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్న ఏకైక తెలుగు ప్రముఖుడు సినీగీత రచయిత సిరాశ్రీ. వృత్తిపరంగానే కాకుండా సమాజహితం కోరి ఆయన చేసిన పలు రచనలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది.
ఐవొరీ కోస్ట్ దేశ రాయబారి వకాబే డయాబి, యూ.ఎ.ఈ నేషనల్ డైరెక్టర్ డా.నాసెర్ సులేమాన్, యూనివెర్సిటీ ఆఫ్రికా డైరెక్టర్ సాంసన్ హెర్మన్, డి.ఎస్.టీ టీవీ-సినిమా మేనేజింగ్ డైరెక్టర్ డా అన్వర్ అలి తదితరులు దుసిట్ థాని హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవడాక్టరేట్లను అందజేసారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







