మంచు హీరోతో బాలయ్య ‘ఊ కొడతారా’ ఉలిక్కిపడతారా..?
- February 27, 2024
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్యాన్ ఇండియా చిత్రంగా ‘కన్నప్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారనుకోండి.
మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా ఇది. ప్యాన్ ఇండియాని ఎట్రాక్ట్ చేసే విధంగానే పలు భాషల నుంచి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
టాలీవుడ్ నుంచి ప్రబాస్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, తమిళ ఇండస్ర్టీ నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు.
ఇంత మందిని ఈ సినిమాలో భాగం చేయడం.. సినిమాని అన్ని భాషల వారికీ దగ్గర చేయడమే అని మంచు విష్ణు చెబుతున్నాడు. ఒక్కొక్కరుగా నటీ నటులు ఈ సినిమా కోసం ఎంపికవుతున్నారు. తాజాగా టాలీవుడ్ నుంచి మరో సీనియర్ స్టార్ పేరు ఈ లిస్టులో ప్రచారం జరుగుతోంది.
ఆయన మరెవరో కాదు, నందమూరి నట సింహం బాలయ్య. బాలయ్య కోసం కొన్ని నిమిషాల నిడివి వున్న పాత్రను ఈ సినిమాలో డిజైన్ చేశారట.
ఆ పాత్ర కోసం బాలయ్యతో సంప్రదింపులు జరుగుతున్నాయట. త్వరలోనే క్లారిటీ రానుంది. అన్నట్లు గతంలో మంచు మనోజ్, బాలయ్య ప్రధాన పాత్రల్లో ‘ఊ కొడతావా ఉలిక్కి పడతావా’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







