‘హాఫ్ లయన్’ పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

- February 28, 2024 , by Maagulf
‘హాఫ్ లయన్’ పై అందరిలోనూ పెరిగిన ఆసక్తి

హైదరాబాద్: మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు కి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం "భారతరత్న" ప్రకటించిన సంగతి తెలిసిందే.1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. 

ఇదే సమయంలో ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బయోపిక్‌ ‘హాఫ్ లయన్’ను రూపొందిస్తున్నట్లు  ప్రకటించారు. పలు భాషలలో రూపొందుతున్నఈ బయోపిక్ పి.వి.నరసింహారావు జీవిత చరిత్రను వివరిస్తుంది. ప్రముఖ  రచయిత వినయ్ సీతాపతి రచించిన 'హాఫ్ లయన్' పుస్తకం ఆధారంగా,జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రకాష్ ఝా ఈ సిరీస్‌కు రూపోందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియాన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. 

పి.వి.నరసింహారావు గొప్ప జీవన ప్రయాణాన్ని ఇది హైలైట్ చేయనుంది.దీంతో‘హాఫ్ లయన్’కు సంబంధించిన మునుపటి ప్రకటనకు మరింత ప్రాముఖ్యత పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com