యానిమల్ వరల్డ్‌లో ప్రబాస్ ఎలా వుండబోతున్నాడో తెలుసా.?
- February 29, 2024
‘యానిమల్’ సినిమాతో మరోసారి తన డైరెక్షన్‌లో పదును చూపించాడు సందీప్ రెడ్డి వంగా. మొదట ఈ సినిమాని తిట్టుకున్నవాళ్లే చాలా ఎక్కువ. కానీ, ఆ తర్వాత అందరూ బాగుందనేసరికి నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా.. అనాల్సొచ్చింది. అలా హిట్టు సినిమా లిస్టులోకి పోయింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కూడా కురిపించింది ఈ సినిమా. ఓటీటీలోనూ జోరు చూపించింది. ఇక, ఆ సంగతి అటుంచితే, ఈ హుషారుతోనే ప్రబాస్‌తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమాకి సంబంధించి అప్‌డేట్ వదిలాడు సందీప్ రెడ్డి వంగా.
‘స్పిరిట్’ అనే టైటిల్‌తో ప్రబాస్, సందీప్ రెడ్డి కాంబోలో మూవీ ఎప్పుడో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కి దుమ్ము దులిపి పైకి తీశాడు సందీప్ రెడ్డి వంగా.
అంతేకాదు, స్టోరీ లైన్, ప్రబాస్ క్యారెక్టర్ కూడా హింట్ ఇచ్చేశాడు. పోలీసాఫీసర్ పాత్రలో ప్రబాస్‌ని చూపించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే, ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కథని ఈ సినిమాలో విభిన్నంగా చూపించబోతున్నాననీ, ఇంతవరకూ పోలీసాఫీసర్ పాత్ర ఆ తరహాలో ఎవ్వరూ తెరపై చిత్రీకరించింది లేదనీ హింట్ ఇచ్చి సినిమాపై ఆసక్తి పెంచేశారు.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట. ప్రస్తుతం ‘కల్కి’, ‘రాజా సాబ్’ సినిమాలతో ప్రబాస్ బిజీగా వున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







