ఈసారి మండే ఎండలు!
- March 01, 2024
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుందని, వేడిమి భరించలేని స్థాయిలో ఉండొచ్చని ఐఎండి తెలిపింది. సాధారణంగా ఊహించిన దానికన్నా ఈశాన్య భారతంలో, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో, మహారాష్ట్ర, ఒడిశాల్లో పలుచోట్ల వడగాడ్పులు ప్రచండంగా ఉండొచ్చని పేర్కొంది. మార్చిలో సాధారణం కన్నా అధికంగా (సుదీర్ఘ కాల సగటు 29.9 మిలీమీటర్ల కన్నా 117శాతం ఎక్కువ) వర్షపాతం వుండొచ్చని, మార్చి–మే మధ్య దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్రో మీడియాకు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగే అవకాశముందని అన్నారు. వర్షాకాలం రెండో అర్ధభాగంలో ‘లా నినా’ నెలకొనే అవకాశమున్నందున వర్షాలు బాగా కురియవచ్చని ఐఎండి తెలిపింది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం