లులూ హైపర్‌మార్కెట్ లో 'రమదాన్ సౌక్' ప్రారంభం
- March 02, 2024
కువైట్: పవిత్రమైన రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని లులూ హైపర్‌మార్కెట్ ఫిబ్రవరి 28న దాని అల్-ఖురైన్ అవుట్‌లెట్‌లో సాంప్రదాయక ‘రమదాన్ సౌక్’ను ప్రారంభించింది. కువైట్‌లోని నమా ఛారిటీ, ఖవాఫిల్ ఛారిటీ, ఇస్లామిక్ కేర్ సొసైటీ, వాస్మ్ అహ్ల్ అల్ ఖైర్ మరియు అల్ నజాద్ ఛారిటీ గ్రూపుల నుండి అధికారులు పాల్గొన్నారు. ఈవెంట్ సందర్భంగా లులు హైపర్‌మార్కెట్ ఈ మానవతా సంస్థల సహకారంతో ప్రత్యేకమైన ఛారిటీ గిఫ్ట్ కార్డ్‌లను ఆవిష్కరించింది. ఫెస్టివల్ గిఫ్ట్ కార్డ్‌లు, KD10, KD25 మరియు KD50 డినామినేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. హైపర్‌మార్కెట్ రమదాన్ మాసంలో చారిటీల మద్దతుతో ప్రతిరోజూ 400 ఉచిత ఇఫ్తార్ ఫుడ్ కిట్‌లను పంపిణీ చేయనుంది. 'రమదాన్ సౌక్' సందర్భంగా ఆహారపదార్థాల నుండి గృహావసరాలు మరియు హృదయపూర్వక బహుమతుల వరకు అవసరమైన రమదాన్ వస్తువుల కొనుగోళ్లపై వివిధ రకాల ప్రమోషన్లు, తగ్గింపుల ఆఫర్లను అందజేస్తుంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!