ఇండియన్ ఎంబసీ అవెన్యూస్‌లో ఇండియా టూరిజం రోడ్‌షో
- March 02, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం కువైట్‌లోని అవెన్యూస్ మాల్‌లో రెండు రోజుల ఇండియా టూరిజం ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ ఈవెంట్ సమ్మర్ టూరిజం, లగ్జరీ ట్రైన్స్ ఆఫ్ ఇండియా, వెల్నెస్ & రిజువెనేషన్, గోల్డెన్ ట్రయాంగిల్ అడ్వెంచర్ & వైల్డ్ లైఫ్ మరియు మరిన్ని వంటి విభిన్న థీమ్‌లతో వివిధ భారతీయ పర్యాటక గమ్యస్థానాల గురించి తెలియజేసారు. సీజర్స్ ట్రావెల్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్, ITL వరల్డ్ మరియు అరోరా హాలిడేస్‌తో పాటు ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఆఫీసుతో సహా కువైట్ నుండి ప్రసిద్ధ టూర్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలగురించి తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కువైటీలు ఇప్పుడు భారతదేశాన్ని సందర్శించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారని లగ్జరీ ట్రావెల్స్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ మిస్టర్ బాబీ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా కువైట్‌లోని వివిధ భారతీయ నృత్య బృందాలు ప్రదర్శించిన భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహినియాట్టం మొదలైన వివిధ భారతీయ కళలు మరియు నృత్య రూపాలు ఆకట్టకున్నాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు