మలేషియా క్షమాభిక్ష పథకం

- March 03, 2024 , by Maagulf
మలేషియా క్షమాభిక్ష పథకం

కౌలాలంపూర్: మలేషియా క్షమాభిక్ష పథకం మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) అక్రమ వలసదారులు స్వదేశానికి వెళ్లే అవకాశం-మలేషియా తెలంగాణ అసోసియేషన్.   

ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం  మైగ్రాన్ట్ రిపాట్రియాషన్ ప్రోగ్రాం (ఆర్పీఎం) ఆమ్నెస్టీ క్షమాభిక్ష ప్రకటించింది . ఈ పథకం మార్చ్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది. 

ఈ  క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు , వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళవచ్చు.

ఈ ఆమ్నెస్టీ  ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో  దాదాపు రూ 10000)  చెలించాల్సివుంది . అలాగే పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా రెండు వారాల్లో ఇండియా  వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  

మలేషియా లో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాదు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు సంబంధించిన కార్మికులు సరైన అవగాహన లేకుండా ఏజెంట్ల చేతులలో మోసపోయి మలేషియా జైల్లో మగ్గుతున్న కార్మికుల ఎందరో వున్నారు.  

ఈ క్షమాభిక్ష పథకం చాలా మందికి  తెలియకపోవటం దురదృష్టకరం. ఇలాంటి మంచి అవకాశాన్ని మలేసియాలో బాధపడుతున్న కార్మికులు వినియోగించుకొని వారు వారి స్వగ్రామాలకు తిరిగి రావాలని, ఈ మలేషియా క్షమాభిక్ష పథకం యెక్క సమాచారాన్ని మీడియా  ద్వారా అందరికి విస్తృత ప్రచారం చేయవలసింది ఆశిస్తున్నాము అలాగే ఈ పథకాన్ని ఉపయోగించుకొని వచ్చే వారికి తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలు వారికీ ఫ్లైట్ చార్జీలు మరియు అపరాధ రుసుము ప్రభుత్వం భరించేలా ముందుకు రావాలని ఈ సందర్భంగా  కోరుతున్నాము.  

ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలిసినవారు మలేషియా తెలంగాణ అసోసియేషన్  ను సంప్రదించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com