డిజిటల్ ప్లేగ్రౌండ్‌లో జాగ్రత్త..!

- March 03, 2024 , by Maagulf
డిజిటల్ ప్లేగ్రౌండ్‌లో జాగ్రత్త..!

బ‌హ్రెయిన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో నడిచే డిజిట‌ల్ ప్లే గ్రౌండ్ లో జాగ్ర‌త్తగా ఉండాల‌ని, దుర్వినియోగం చేస్తే  బహ్రెయిన్‌లో భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని నియంత్రించడానికి సమగ్ర మార్గదర్శకాలను ఏర్పాటు చేయమని షురా కౌన్సిల్ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రతిపాదిత చ‌ట్టం ప్ర‌కారం.. నేరస్థులకు జైలు శిక్షతో పాటు BD2,000 నుండి BD20,000 వరకు జరిమానాను ఎదుర్కోవచ్చు. AI సాంకేతికతను ఉపయోగించి సమ్మతి లేకుండా చిత్రాలు, ప్రసంగాలు లేదా అధికారిక ప్రకటనలను మార్చే వ్యక్తుల‌ను నేర‌స్థుల కింద‌కు వ‌స్తారు. ఈ ప్రతిపాదనను షురా సభ్యులు అలీ హుస్సేన్ అల్ షెహాబి, జమాల్ ఫఖ్రో, డాక్టర్ జిహాద్ అల్ ఫదేల్, డాక్టర్ మహమ్మద్ అలీ హసన్ మరియు దలాల్ అల్ జాయెద్ సమర్పించారు. బహ్రెయిన్ అధికార పరిధిలో ప్రోగ్రామింగ్, ప్రాసెసింగ్ మరియు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌తో కూడిన AI సాంకేతికతలు బాధ్యతాయుతంగా మరియు చట్టబద్ధంగా ఉపయోగించబడుతున్నాయని కఠినమైన నియంత్రణలను అమలు చేయడం తప్పనిసరి అని సభ్యులు  చెప్పారు.      

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com